కనిగిరి: కంభంపాడు జాతీయ రహదారిపై ఉన్న గ్రావెల్ తో రోడ్డు ప్రమాదాలు, గ్రావెల్ తొలగించిన ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్, సిబ్బంది
చంద్రశేఖరపురం మండలం కంభంపాడు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున మట్టి పడి ఉండడంతో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు చంద్రశేఖరపురం ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ కు ఫిర్యాదు చేశారు. వాహనదారుల ఫిర్యాదు పై స్పందించిన వెంకటేశ్వర్లు నాయక్ గురువారం సిబ్బందితో కలిసి కంభంపాడు జాతీయ రహదారిపై పేరుకుపోయిన గ్రావెల్ ను సిబ్బందితో కలిసి స్వయంగా తొలగింప చేశారు. ఈ సందర్భంగా వాహనదారులు ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు.