ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నెల పూజోత్సవం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నెల పూజోత్సవం భక్తిశ్రద్ధల నడుమ శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో పెన్నహోబిలం మార్మోగింది. పెన్నహోబిలంలో రథోత్సవం అనంతరం జరిగే నెల పూజోత్సవ కార్యక్రమం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. తరలివచ్చిన భక్తజనానికి ఆలయం వద్ద తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. *మీ సాక్షి టీవీ లో..*