ఉరవకొండ: జన గణనలో భాగంగా మొదటి దశలో చేపట్టిన గృహ గణనను సమగ్రంగా చేపట్టండి : బెలుగుప్ప మండల తహసిల్దార్ అనిల్ కుమార్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో జన గణనలో భాగంగా మొదటి దశలు చేపట్టిన గృహ గణనను సమగ్రంగా చేపట్టాలని మండల తహసిల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని కాలనీలలో జనగణన సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లు చేపట్టిన గృహ గణనను మండల తహసిల్దార్ పరిశీలించారు. ప్రజలందరూ సెన్సెస్ -2027 మొదటి విడతలో కొనసాగుతున్న గృహ గణనకు, తదుపరి జనాభా గణనకు సహకరించాలని డిప్యూటీ తహశీల్దార్ గురుబ్రహ్మ, స్థానికులు టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జునలతో కలసి ప్రజలకు తహసీల్దార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జనగణన సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.