కనిగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవోత్సవం
కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకి సేవోత్సవ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకిని స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి, పూజలు చేశారు. పల్లకి సేవోత్సవ కార్యక్రమం అనంతరం వేదపండితులు భక్తులకు ఆశీర్వచనాలను అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.