కనిగిరి: హనుమంతునిపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు
హనుమంతునిపాడు లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు, డిజిటల్ అసిస్టెంట్లతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీడీవో సూచించారు. ఉద్యోగుల సామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు భవిష్యత్తులో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలపై ఆయన వారికి వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సర్వేలను నిర్దిష్ట కాల పరిమితితో పూర్తి చేయాలన్నారు