సంతనూతలపాడు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ గుంటూరులో రాయబార చర్చలకు భారీ ప్రదర్శనగా వెళ్లిన నాగులుప్పలపాడు రైతులు
నాగులుప్పలపాడు మండలం పొగాకు రైతులు సోమవారం గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో రాయబార చర్చలకు వెళ్లారు. ఈ సందర్భంగా నాగులుప్పలపాడు రైతు సంఘం ఆధ్వర్యంలో వారు భారీ ప్రదర్శన చేపట్టారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ... పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. చర్చల సందర్భంగా రైతులకు సరైన గిట్టుబాటు హామీని ఇవ్వాలని, లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.