సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలోని గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు
చీమకుర్తి పట్టణంలోని పలు గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. గత మూడు రోజులుగా వరుసగా అధికారులు గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు చేపడుతూ ఉండడంతో గ్రానైట్ కంపెనీల యజమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయా? అనుమతి ఉన్న ప్రాంతాల్లో కాక మరో ప్రాంతంలో మైనింగ్ కొనసాగుతుందా అనే వివరాలను అధికారులు పరిశీలన చేశారు. క్వారీల్లో తరలింపుకు సిద్ధంగా ఉన్న గ్రానైట్ రాళ్లను పరిశీలించారు. తనిఖీల్లో వెలుగు చూసిన వివరాలను రికార్డుల్లో నమోదు చేశారు.