కనిగిరి: పట్టణంలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్
కనిగిరి పట్టణంలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలో ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్ ఆవిష్కరించారు. కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి, కమిటీ సభ్యులను కేంద్రమంత్రి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు.