రాప్తాడు: దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలి అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశంలో రాప్తాడు ఎమ్మార్పీఎస్ కుంటిమిది ఓబులేష్
అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమధ్య ఓబులేష్ దళిత సంఘాలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంటిమద్ది ఓబులేసు మాట్లాడుతూ దళితులకు హరించే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని లేకుంటే కలిసి వచ్చే అన్ని దళిత సంఘాలతో కలిసి ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తామని రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిది ఓబులేష్ పేర్కొన్నారు.