ఉరవకొండ: వ్యవసాయ సహకార సంఘ రైతులకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం స్థానిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద శుక్రవారం సంఘ అధ్యక్షులు కంచి రాముడు అధ్యక్షతన రైతులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం సహకార సంఘ బ్యాంకు మేనేజర్ పణిభూషణ్, అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్, ఏ ఓ పృధ్వి సాగర్ లు రైతులకు అవగాహన కల్పించారు. ప్రధానంగా సైబర్ నేరాలపై అప్రమత్తం గా ఉండాలని, మొబైల్లో ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయరాదన్నారు. సహకార సంఘంలో రుణాలు సక్రమంగా చెల్లించి వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు లక్ష్మీబాయి, ఈశ్వర్ రైతులు పాల్గొన్నారు.