కుత్బుల్లాపూర్: దేవేందర్‌నగర్ వడ్డెర బస్తీ బొందలగడ్డ ఆక్రమణపై జనసేన నాయకుడు నరేందర్ సర్కార్ ఆందోళన
దేవేందర్‌నగర్ వడ్డెర బస్తీలో సంచారజాతి వడ్డెరల పూర్వీకుల బొందలగడ్డ ఆక్రమణకు గురవుతోందని జనసేన నాయకుడు నరేందర్ సర్కార్ ఆరోపించారు. సమాధులపై మట్టి, వ్యర్థాలు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని, దీనిని అరికట్టి వెంటనే ప్రహరీ నిర్మించాలని ఆయన అధికారులను కోరారు.