మేడ్చల్: రామంతాపూర్ పెద్ద చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా, గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.