మేడ్చల్: ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన
ఉప్పల్ మినీ శిల్పారామంలో జరుగుతున్న స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పోలో భాగంగా రాధికా రాణి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. కన్విక, మీనాక్షి, తన్వి, భావన, ఉహిక, అమూల్య, కౌశిక, జాగృతి తదితర కళాకారులు వివిధ స్తోత్రాలు, నృత్య అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు.