కనిగిరి: పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ
కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులు స్వామివారి పనులకిని స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి, స్వామివారికి పూజలు చేశారు. ఆలయ పండితులు భక్తులకు ఆశీర్వచనాలను అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.