కనిగిరి: పట్టణంలో మంచినీటి దొరువు ఆధునికీకరణ పనులను పరిశీలించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
కనిగిరి పట్టణంలోని మంచినీటి దొరువు ఆధునీకీకరణ పనులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కనిగిరి, గిద్దలూరు శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. మంచినీటి దొరువు ఆధునికీకరణ పనుల వివరాలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు వివరించారు. చారిత్రక నేపథ్యం కలిగిన మంచినీటి దొరువు ఆధునికీకరణ పనుల కు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని మంత్రి రవికుమార్ అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.