కనిగిరి: పట్టణంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి: మున్సిపాలిటీ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్
కనిగిరి పట్టణంలోని 20 వార్డులో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను కనిగిరి మున్సిపల్ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ స్థానిక టిడిపి నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ కు ఫిరోజ్ సూచించారు. కనిగిరి మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా పట్టణానికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని వచ్చి అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.