కనిగిరి: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పోలింగ్ బూత్ లెవెల్ అధికారులతో సమావేశమైన మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులతో మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం 20 వార్డులుగా ఉన్న కనిగిరి మున్సిపాలిటీని ప్రభుత్వం 32 వార్డులుగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 32 వార్డులకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బౌండరీలను ఫిక్స్ చేయడం జరిగిందన్నారు. బూత్ లెవెల్ అధికారులు 32 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించేందుకు సహకరించాలని కమిషనర్ కోరారు.