కనిగిరి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి: ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కనిగిరి ఎమ్మెల్యే మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. గురువారం ఒంగోలులో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు.