సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో సిబ్బంది కొరత కారణంగా గత కొన్ని రోజులుగా మూతపడిన ప్రభుత్వ గ్రంథాలయం
చీమకుర్తి పట్టణంలో ప్రభుత్వ గ్రంథాలయం గత కొన్ని రోజులుగా మూతపడింది. గ్రంథాలయంలో సిబ్బంది కొరత కారణంగా గ్రంధాలయాన్ని తెరవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం గ్రంధాలయాల్లో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించినప్పటికీ చీమకుర్తి గ్రంథాలయం తెరవకపోవడంతో విద్యార్థులు ఈ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయం మూతపడి ఉండడం మంచి పరిణామం కాదని, అధికారులు తక్షణం స్పందించి మూతపడిన గ్రంథాలయాన్ని తెరిపించాలని కోరుతున్నారు.