సంతనూతలపాడు: తమపై పని భారాన్ని తగ్గించాలని కోరుతూ సంతనూతలపాడు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వీఆర్వోలు, సర్వేయర్లు, వీఆర్ఏలు
సంతనూతలపాడు రెవెన్యూ కార్యాలయం ముందు సోమవారం మండలంలో పనిచేస్తున్న వీఆర్వోలు, గ్రామాల సర్వేయర్లు, వీఆర్ఏలు నిరసన చేపట్టారు. జిల్లా వీఆర్వోల సంఘ అధ్యక్షులు ఏసీ ఆదిరెడ్డి మాట్లాడుతూ... వీఆర్వోలు, సర్వేర్లు, వీఆర్ఏల పని ఒత్తిడిని తగ్గించాలని కోరారు. ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు టెలికాన్ఫరెన్స్, రాత్రి 8, 9 గంటలకు గ్రూప్ కాన్ఫరెన్స్ జరుగుతున్నాయన్నారు. రాత్రి 10 గంటల వరకు నిరంతరం రెవెన్యూ విధులతో తామంతా ఆందోళనకు గురవుతున్నామని ఆదిరెడ్డి అన్నారు. తక్షణం ప్రభుత్వం ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.