కనిగిరి: పలనాడు జిల్లా మాచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, వెలిగండ్ల, చంద్రశేఖరపురం మండలాలకు చెందిన నలుగురు మృతి
పల్నాడు జిల్లా మాచర్ల వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనిగిరి నియోజకవర్గం లోని వెలిగండ్ల, చంద్రశేఖరపురం మండలాలకు చెందిన నలుగురు మృతి చెందారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లి, చంద్రశేఖరపురం మండలం శీలం వారి పల్లి గ్రామాలకు చెందిన కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలి నాగిరెడ్డిపల్లిలో తమ బంధువు మృతిచెందగా చూసేందుకు సుమ వాహనంలో వస్తూ మాచర్ల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.