రాప్తాడు: సిండికేట్ నగర్ లో పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పదో తరగతి విద్యార్థినిలకు ప్రతిభా పురస్కారాలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సిండికేట్ నగర్ లో ఆదివారం 12 నెలల నుంచి మూడున్నర గంటల వరకు అనంతపురం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ లక్ష్మీనరసింహులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జింక సూర్యనారాయణ ఆధ్వర్యంలో పద్మశాలి కులానికి చెందిన 116 మంది ఇంటర్మీడియట్ పదో తరగతి అధిక మార్కులు సాధించిన విద్యార్థినిలకు ప్రతిభ పురస్కారాలను నగుదును అందించడం జరిగిందని పద్మశాలి రాష్ట్ర డైరెక్టర్ లక్ష్మీనరసింహులు, సూర్యనారాయణ తదితరులు పేర్కొన్నారు.