నడికూడ: హన్మకొండ జిల్లాలో విషాదం: జ్వరంతో గర్భిణి మృతి
హన్మకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామానికి చెందిన 24 ఏళ్ల గర్భిణి గౌరి జ్వరంతో మృతి చెందారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి రెండేళ్ల కుమార్తె ఉంది.