వరికోలులో టీవీ రిపేర్ చేస్తానని చెప్పి ఓ ఇంట్లో 2 బంగారు ఉంగరాలు, చైన్లు, 20 తులాల వెండి, రూ.10వేల నగదు చోరీ
హన్మకొండ జిల్లా నడికుడ మండలం వరికోలు గ్రామానికి చెందిన గాలి రాజు కు చెందిన ఇంట్లో గుర్తుతెలియని దుండగుడు టీవీ రిపేర్ చేస్తానని చెప్పి బంగారంతో పాటు వెండి నగదును ఎత్తుకెళ్లాడు. రాజు తన భార్య తో పాటు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటి వద్ద రాజు తల్లిదండ్రులు ఉన్నారు మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నీ కొడుకు రాజు ఇంట్లో టీవీ రిపేర్ చేయమని పంపించాడని నమ్మబలికి ఇంట్లోకి చొరబడ్డాడు టీవీ రిపేర్ చేస్తునట్లు నటించి బీరువాలో ఉన్న రెండు బంగారు ఉంగరాలు,రెండు బంగారు చైన్లు, 20 తులాల వెండి, పదివేల నగదుతో పారిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపార. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు