ఉరవకొండ: విలేకరులపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య : తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి మల్లికార్జున
విలేకరులపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని ప్రాణాలను హతమార్చడం మరీ దుర్మార్గమని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రానికి చెందిన టిడిపి నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. విలేకరులపై దాడులు తగదని విలేకరులతో కాళ్లు పట్టించుకోవడం, వారిని హతమార్చడం ఘటనలు ప్రజాస్వామ్యంలో తగవన్నారు. తెలుగుదేశం పార్టీ, ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఇలాంటి ఘటనపై తప్పక చర్యలు చేపడుతుందన్నారు.