ఉరవకొండ: ప్యాపిలి కొత్తకోట గ్రామాల మధ్య మొహరం వేడుకల్లో ఘర్షణ... రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ప్యాపిలి కొత్తకోట గ్రామాల మధ్య శనివారం సాయంత్రం మొహరం వేడుకల్లో ఇరువర్గాల మధ్య గొడవ కాస్త ఘర్షణకు దారి తీసింది. పీర్ల చావడి ఎదుట అలాయ్ తొక్కాలని ఒక వర్గం డిమాండ్ చేయగా మీరు ముందుకు రాకూడదంటే మరో వర్గం అభ్యంతరం తెలపడంతో ఘర్షణ చెలరేగి పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు సైతం రాళ్లు తగిలాయి. ఘర్షణలో బాలికతో పాటు మరో ఐదు మంది పైగా గాయాల పాలయ్యారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.