కొత్తగూడెం: పాల్వంచలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్: ఇద్దరు మహిళలకు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఇందిరా కాలనీ వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. కొత్తగూడెం నుంచి పెద్దమ్మ గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.