మహబూబాబాద్: మహబూబాబాద్‌లో శ్రమదానం: పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్, చైర్ పర్సన్ జ్యోతి
గాంధీ జయంతి సందర్భంగా మహబూబాబాద్ 11వ వార్డులో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి రమేష్ నాయక్ పాల్గొన్నారు. పట్టణ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ రహిత నగరం కోసం సహకరించాలని ప్రజలను కోరారు.