ఉరవకొండ: పాల్తూరు సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు సమీపంలో శుక్రవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పంపన గౌడ(62) ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పాల్తూరు- గాజుల మల్లాపురం గ్రామాల మధ్య పెద్ద వంక వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న వారిలో వ్యాసాపురం గ్రామానికి చెందిన రాజన్న, నల్లారెడ్డి గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.