కనిగిరి: బోయమడుగుల లో స్వచ్ఛ కార్యక్రమం, శానిటేషన్, ఐవిఆర్ఎస్ సర్వే ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీవో ప్రతాపరెడ్డి
చంద్రశేఖరపురం మండలంలోని బోయమడుగుల గ్రామంలో ఎంపీడీవో ప్రతాపరెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో శానిటేషన్, స్వచ్ఛ కార్యక్రమం, ఐ వి ఆర్ ఎస్ సర్వేను క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమైన ఎంపీడీవో.. గ్రామాన్ని పరిశుభ్రతగా ఉంచుకునేందుకు గ్రామస్తులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాధులు దరి చేరవని సూచించారు. గ్రామస్తులు ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి అందించాలని సూచించారు.