సంతనూతలపాడు: గుమ్మలంపాడు లో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించిన సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు
సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడులో ఎంపీడీవో సురేష్ బాబు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై స్థానికులకు ఎంపీడీవో అవగాహన కల్పిస్తూ వారికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఇంటింటి గార్బేజ్ సేకరణ పై పంచాయతీ సిబ్బందితో ఎంపీడీవో చర్చించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి స్థానికుల నుండి తడి చెత్త, పొడి చెత్తను సేకరించాలన్నారు. సేకరించిన చెత్తను చెత్త సంపద కేంద్రానికి తరలించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.