కనిగిరి: పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం కృషిచేసిన మహోన్నత నేత వైయస్సార్: కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ జయంతి కార్యక్రమాన్ని వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, వైసీపీ సీనియర్ నాయకులు బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. రైతులకు ఉచిత విద్యుత్, 108 వాహనాలు, జలయజ్ఞం ద్వారా పేదలు మరియు రైతుల సంక్షేమానికి కృషిచేసి, వారి హృదయాల్లో వైయస్సార్ జరగని ముద్ర వేశారని కొనియాడారు.