ఉరవకొండ: హనిమిరెడ్డిపల్లి గ్రామంలో పల్స్ పోలియో కేంద్రాన్ని పరిశీలించిన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని హనిమిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అనిల్ కుమార్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, కోఆర్డినేటర్ కిషోర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆడిషన్ డైరెక్టర్ అనిల్ కుమార్ , చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.అనంతరం మాట్లాడుతూ పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని పేర్కొన్నారు.