పొదిలిలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు, కార్యకర్తలతో కలిసి ఒంగోలు-కర్నూలు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు.