రాయదుర్గం: మానవ అక్రమ రవాణా తీవ్ర నేరంగా పరిగణించాలి : జూనియర్ సివిల్ జడ్జి ఎం.రమ్య
మానవ అక్రమ రవాణా హక్కుల ఉల్లంఘన అని, దీనిని తీవ్ర నేరంగా పరిగణించాలని రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి ఎం.రమ్య అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా అధికార కమిటీ ఆధ్వర్యంలో రాయదుర్గంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ మహిళలు, పిల్లలు, బలహీన వర్గాలను దోపిడీ నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని, అనుమానిత కేసులను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. చట్టపరమైన నిబంధనలు, బాధితుల రక్షణ, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. CDPO లక్ష్మీప్రసన్న, రూరల్ సీఐ వెంకటరమణ, న్యాయవాది శ్యామలమ్మ పాల్గొన్నారు.