రాయదుర్గం: ఆరోగ్య సందేశంతో అందరి మన్ననలు పొందిన పట్టణంలోని 5వ తరగతి విద్యార్థిని
రాయదుర్గం పట్టణంలోని ఓబులచారి రోడ్డు, ఆంధ్రా కేసరి ప్రకాశం పంతులు ఎలిమెంటరీ స్కూల్లో గురువారం దోమల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మలేరియా అధికారి నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దోమలు పుట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. 5వ తరగతి విద్యార్థిని అమృత దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చక్కగా వివరించి అందరి ప్రశంసలు అందుకుంది. పిల్లలు ఆరోగ్య రాయబారులుగా మారితే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం సులభమవుతుందని నాగేంద్రప్రసాద్ తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.