కనిగిరి: పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే బుచేపల్లి సుబ్బారెడ్డి: కనిగిరి వైసీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్
కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సోమవారం చీమకుర్తి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా దర్శి మాజీ ఎమ్మెల్యే ,దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో నారాయణ యాదవ్ పాల్గొన్నారు. చీమకుర్తిలోని సుబ్బారెడ్డి ఘాట్ కు వెళ్లి, నివాళులు అర్పించారు. అనంతరం నారాయణ యాదవ్ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ అభివృద్ధిలో బూచేపల్లి సుబ్బారెడ్డి కీలక భూమిక పోషించారన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన మహోన్నత నాయకుడు సుబ్బారెడ్డి అని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.