ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో హై అలర్ట్ ప్రకటించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. అందులో భాగంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అలానే అనుమానిత వ్యక్తులను కొత్త వ్యక్తుల వివరాలను ప్రశ్నించి వారి వివరాలను సేకరించారు.