సంతనూతలపాడు: నాగులుప్పలపాడు పంచాయతీలో పారిశుద్ధ్య చెత్త రిక్షాలను పంపిణీ చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
నాగులప్పలపాడు గ్రామంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా నాగులుప్పలపాడు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు చెత్త రిక్షాలను ఎమ్మెల్యే విజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తడి చెత్త, పొడి చెత్తను సేకరించి చెత్త సంపద కేంద్రాలకు వాటిని తరలించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.