ఉరవకొండ: బెళుగుప్ప శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సంకష్ఠహర చతుర్థి పూజలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం సామూహిక సంకష్టహర చతుర్థి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్ కు పంచామృత అభిషేకాలు పుష్పాలంకరణ పూజలు పల్లకి సేవ కార్యక్రమాలను ప్రధాన అర్చకులు రాంబాబు స్వామి నిర్వహించారు. మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో సామూహిక సంకష్టి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయం వద్ద దాతలతో కలసి సేవా కమిటీ సభ్యులు తీర్థప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.