కనిగిరి: మారేళ్ళలో చెత్త సంపద కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు
పెదచెర్లపల్లి మండలంలోని మారెళ్ళ గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చట్ట సంపద కేంద్రాలను ఆయన పరిశీలించారు. గ్రామంలోని తడి చెత్త, పొడి చెత్తను సేకరించి చెత్త సంపద కేంద్రాలకు తరలించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై, చెత్త సంపద కేంద్రాల యొక్క వినియోగంపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛ రథాన్ని పరిశీలించారు. గ్రామస్తులు తమకు ఇళ్లలో పనికిరాని వస్తువులను స్వచ్ఛ రథం నిర్వాహకులకు ఇచ్చి,, ఇళ్లకు అవసరమైన వస్తువులను తీసుకు వెళ్ళవచ్చని సూచించారు.