ఉరవకొండ: బెళుగుప్పలో ఘనంగా శ్రీ వాసవి మాత జయంతి వేడుక
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి మాత జయంతి వేడుకను ఆర్యవైశ్యలు గురువారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి భక్తి ప్రవర్తుల మధ్య కలశాలను తీసుకువచ్చి అభిషేకాలను, హోమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయం వద్ద చల్లకి పానీయాలు తీర్థ ప్రసాదాల పంపిణీ అన్నదాన కార్యక్రమాలను ఆర్యవైశ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.