సంతనూతలపాడు: సంతనూతలపాడు లో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల వ్యవసాయ శాఖ అధికారి పావని
సంతనూతలపాడులోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిణి పావని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాలలోని ఎరుగుల రిజిస్టర్లను పరిశీలించి, ఎలుగుల స్టాకును తనిఖీ చేశారు.యూరియా, DAP ఎరువులను APAIMS 2.0 యాప్ ద్వారా పంపిణీ చేస్తున్నారా? లేదా? అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం AP AIMS 2.0 యాప్ ను తీసుకువచ్చిందన్నారు. యాప్ ద్వారా విక్రయాలు డీలర్లు అందరూ కచ్చితంగా పాటించాలన్నారు.