కనిగిరి: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో BLO లకు ఎన్నికల సంఘ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై శిక్షణ
కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై మండలంలోని బిఎల్ఓ లకు తహసిల్దార్ టీవీ మారుతీ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లు రమణారెడ్డి ప్రవీణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను వివరించారు. బి ఎల్ వో లు ఇంటింటి సర్వే ఓటర్ల ధ్రువీకరణ మరియు అభ్యంతరాల స్వీకరణ వంటి చర్యలను చేపట్టాలని తహసిల్దార్ సూచించారు.