కనిగిరి: పట్టణంలో అంగరంగ వైభవంగా మొహర్రం వేడుకలు, పీర్ల ఊరేగింపు ఉత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు
కనిగిరి పట్టణంలో మొహర్రం వేడుకలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనిగిరి పట్టణంతోపాటు శంఖవరం, టకారి పాలెం లకు చెందిన పీర్ల ఉత్సవ కమిటీల నిర్వాహకులు పీర్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి పట్టణంలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పీర్ల ఉత్సవాన్ని కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు చర్యలను చేపట్టారు.