రాయదుర్గం: రైలు కింద పడి రెండు గేదెలు మృతి, అరగంట నిలిచిపోయిన బెంగళూరు రైలు
రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో బళ్లారి రోడ్డు వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఘటనలో రన్నింగ్ రైలు కింద పడి రెండు గేదెలు మరణించాయి. దీంతో బెంగళూరు వెళ్లే రైలు సుమారు అరగంటకు పైగా నిలిచిపోయింది. స్థానికుల సమాచారం మేరకు, రైల్వే ట్రాక్ దాటుతుండగా రెండు గేదెలు వేగంగా వస్తున్న రైలును గమనించలేదు. రైలు ఢీకొనడంతో రెండు గేదెలు అక్కడికక్కడే మరణించాయి. వాటిలో ఒక గేదె కళేబరం రైలు చక్రాల కింద ఇరుక్కుపోవడంతో రైలు నిలిచిపోయింది. ఘటనను గమనించిన లోకో పైలట్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కళేబరాన్ని తొలగించే చర్యలు చేపట్టారు.