కనిగిరి: పామూరులో శ్రీ మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా స్వామివారి పారువేట కార్యక్రమం, భారీగా భక్తుల రాక
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి పారు వేట కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద నుండి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి పారువేట కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి పూజలు చేశారు. భక్తులకు పండితులు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.