కనిగిరి: నియోజకవర్గంలో మొదటి ఫేజ్ లో 4000 గృహాలకు సౌర విద్యుత్: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి గిరిజన కాలనీలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా అందించే సౌర విద్యుత్ ను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... కనిగిరి నియోజకవర్గం లో మొదటి విడతలో 4000 గృహాలకు పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ గృహాలకు సౌర విద్యుత్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో సౌర విద్యుత్ వినియోగంలో కనిగిరి నియోజకవర్గం ముందంజలో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు.