కనిగిరి: రాష్ట్రంలో నెలరోజులపాటు క్లీన్ అండ్ స్వీప్ కార్యక్రమం: రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి: రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు క్లీన్ అండ్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కనిగిరిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నెలరోజులపాటు ఈ కార్యక్రమంలో భాగంగా కాలువలు, మరియు పట్టణాలు, పల్లెల్లో ఉన్న చెత్తను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇటీవలే రాష్ట్రంలోని 5 గ్రామపంచాయతీలు జాతీయస్థాయిలో అవార్డులు పొందిన విషయాన్ని మంత్రి స్వామి గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.