రాప్తాడు: ఎమ్మెల్యే పరిటాల సునీత రెండేళ్లలో ఎన్నో అక్రమాలు హత్యలు చేయించారు తోపుదుర్తిలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు తోపుదుర్తి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాల టిడిపి పాలనలో ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు మురళి రాప్తాడులో సత్యనారాయణ రెడ్డి హత్య పోలేపల్లి లో లింగమయ్య హత్యను చేయించడంలో ప్రధాన ముద్దాయి అదేవిధంగా పలు దౌర్జన్యాలు కూడా చేయించడం జరిగిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు.